హనుమకొండ: రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ నిరసనను ఉద్దేశించి ఏబీఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధుల విడుదల ఆలస్యం కావడం వల్ల వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, పెండింగ్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయడంతో పాటు విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.డిమాండ్లు నెరవేర్చకపోతే పోరాటాన్ని రాష్ట్రస్థాయికి విస్తరిస్తామని స్పష్టం చేశారు..
ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ ముఖ్య నాయకులు, పలువురు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేశారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


