కొరియన్ కనకరాజు: వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్‌ను అవమానించేలా ఓ డైలాగ్ ఉందంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న సీనియర్ ఎన్టీఆర్ సినిమా డైలాగ్‌ను ఉద్దేశపూర్వకంగానే ఈ చిత్రంలో ఉపయోగించారని వారు ఆరోపిస్తున్నారు. ‘కొరియన్ కనకరాజు’లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యుగపురుషుడు’లోని ప్రసిద్ధ “మీ షాట్ చాలా అమెచ్యూరీష్గా ఉంది” డైలాగ్‌ను ఫైట్ సీన్లో ఉపయోగించారు. ప్రేక్షకులు దీనిని హాస్యంగా స్వీకరిస్తుండగా, నందమూరి అభిమానులు మాత్రం మహానటుడి ఐకానిక్ సీన్‌ను చౌకగా చూపించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
సీన్ తొలగించాలని డిమాండ్:
ఈ వివాదాస్పద సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని NTR అభిమానులు మేకర్స్‌ను డిమాండ్ చేస్తున్నారు. తమ అభిమాన నటుడి గౌరవానికి భంగం కలిగించేలా ఎలాంటి డైలాగ్‌లు ఉండకూడదని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
మరోవైపు భిన్నాభిప్రాయాలు:
అయితే ఈ అంశంపై మరో వర్గం భిన్నంగా స్పందిస్తోంది. గతంలో అనేక సినిమాల్లో సీనియర్ హీరోల డైలాగ్‌లు, హావభావాలు, మేనరిజమ్‌లను అనుకరించిన సందర్భాలు ఉన్నాయని, ఇందులో తప్పేమీ లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై చిత్రబృందం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.


