HomeLatest Newsగడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా? మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై తండ్రి...

గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా? మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై తండ్రి ఆగ్రహం

Published on

spot_img

మహబూబాబాద్:ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నాలుగేళ్ల చిన్నారి ప్రాణాల మీదకు వచ్చినంత పనైంది. కాలం చెల్లిన (Expired) మందులు ఇచ్చారంటూ ఆసుపత్రి సిబ్బందిపై ఒక తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

​స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళీ తన నాలుగేళ్ల కుమారుడు ఎనోస్ రాజ్‌ వాంతులు, విరోచనాలతో బాధపడుతుండటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఓపీలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు రెండు రకాల సిరప్‌లను రాశారు. ఆసుపత్రి ఫార్మసీ సిబ్బంది ఒక సిరప్‌ను ఇచ్చి, మరొకటి బయట మెడికల్ షాప్‌లో తీసుకోమని చెప్పారు.

​అయితే, ఇంటికి వెళ్లిన తర్వాత బాబుకు సిరప్‌ వేసేందుకు తండ్రి మురళీ సీసాను పరిశీలించగా.. దానికి జూన్ 2026 నాటికే గడువు ముగిసి ఉన్నట్లు గమనించాడు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న తండ్రి, కాలం చెల్లిన మందులు ఎలా ఇస్తారంటూ ఫార్మసీ సిబ్బందిని నిలదీశాడు. ఈ క్రమంలో సిబ్బందికి, తండ్రికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

​”గడువు ముగిసిన మందులు ఇస్తే పిల్లాడు చావాలా?” అంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్న పిల్లల విషయంలో వైద్య సిబ్బంది ఇలాంటి బాధ్యతారాహిత్యానికి పాల్పడటంపై స్థానికులు, రోగుల బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.