HomeLatest Newsప్రభుత్వ వైద్య సంస్థల్లో సిబ్బంది కొరతపై కేంద్రం నిర్లక్ష్యం: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య...

ప్రభుత్వ వైద్య సంస్థల్లో సిబ్బంది కొరతపై కేంద్రం నిర్లక్ష్యం: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ఆగ్రహం

Published on

spot_img

ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతపై కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకోవడం సమంజసం కాదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్‌సభలో వరంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల, మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రితో పాటు కేంద్ర సహకారంతో నడిచే ప్రభుత్వ వైద్య సంస్థల్లో సిబ్బంది కొరతపై ఆమె ప్రశ్న లేవనెత్తారు.

​ఆయా సంస్థల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలతో పాటు గత మూడేళ్లలో పోస్టుల భర్తీకి చేపట్టిన చర్యలను వెల్లడించాలని ఎంపీ కోరారు.

​కేంద్రం లిఖితపూర్వక సమాధానం:

ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్ లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆరోగ్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా రాష్ట్రాలు పంపే ప్రతిపాదనల మేరకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఖాళీల వివరాలు ‘హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా’ నివేదికలో ఉన్నాయని పేర్కొంటూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీర్చేందుకు ప్రత్యేక అలవెన్సులు, ‘యూ కోట్–వీ పే’ వంటి విధానాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.

​రాష్ట్రాలపై నెట్టేయడం సరికాదు:

కేంద్ర మంత్రి సమాధానంపై ఎంపీ కడియం కావ్య స్పందిస్తూ.. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలోని అంశమని చెప్పి కేంద్రం చేతులెత్తేయడం సరికాదన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తీవ్రస్థాయిలో వైద్యులు, స్పెషలిస్టులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కొరత ఉందని, దీనివల్ల సామాన్య రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

​ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆరోగ్య రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి, తెలంగాణకు అదనపు నిధులు కేటాయించాలని డెమాండ్ చేశారు. ఎంజీఎం వంటి కీలక ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.