ఉద్యోగాలు : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిజైన్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి 120 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు ఆగస్టు 14, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
120 పోస్టులు.. విభాగాల వారీగా:
మొత్తం 120 పోస్టుల్లో డిజైన్ ట్రైనీ 60, మేనేజ్మెంట్ ట్రైనీ 60 పోస్టులు ఉన్నాయి. డిజైన్ ట్రైనీ పోస్టుల్లో ఏరోనాటికల్ 4, ఎలక్ట్రికల్ 7, ఎలక్ట్రానిక్స్ 20, ఇన్స్ట్రుమెంటేషన్ 3, మెకానికల్ 22, కంప్యూటర్ సైన్స్ 3, మెటలార్జీ 1 పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల్లో ఎలక్ట్రికల్ 11, ఎలక్ట్రానిక్స్ 12, మెకానికల్ 27, కంప్యూటర్ సైన్స్ 1, మెటలార్జీ 2, ప్రొడక్షన్ 5, సివిల్ 2 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు, వయోపరిమితి:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, EWS అభ్యర్థులు కనీసం 70 శాతం, SC, ST, PwBD అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 2026 ఆగస్టు 14 నాటికి అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో పరీక్ష, సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
దరఖాస్తు వివరాలు:
ఆన్లైన్ దరఖాస్తులు జూలై 29 నుంచి ఆగస్టు 14 వరకు స్వీకరిస్తారు. SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. పూర్తి వివరాల కోసం HAL అధికారిక వెబ్సైట్ hal-india.co.in ను సందర్శించాలి.


