HomeWarangal Newsఖాళీల పర్వం... బకాయిల మోత: వరంగల్ పర్యటనలో 'బాస్' పరిష్కరించేనా?

ఖాళీల పర్వం… బకాయిల మోత: వరంగల్ పర్యటనలో ‘బాస్’ పరిష్కరించేనా?

Published on

spot_img

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పర్యటించనున్న పోలీస్ బాస్ (డీజీపీ) అక్కడ పేరుకుపోయిన పలు కీలక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అధికారుల పోస్టింగ్‌లు, సిబ్బంది సంక్షేమ అంశాలు ఇప్పుడు కమిషనరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

 ముఖ్యమైన ఏసీపీ, సీఐ, ఎస్సై పోస్టులు ఖాళీ:

   కమిషనరేట్ పరిధిలోని అతిముఖ్యమైన వరంగల్, జనగామ ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) పోస్టులు గడిచిన నాలుగు నెలలుగా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. వీటితో పాటు ధర్మసాగర్, నర్మెట సీఐ పోస్టులు, నెక్కొండ ఎస్సై పోస్టులను కూడా ఇప్పటివరకు భర్తీ చేయలేదు. కీలకమైన స్థానాల్లో పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో శాంతిభద్రతల పర్యవేక్షణపై ప్రభావం పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

 ఏఆర్ సిబ్బంది ‘టీఏ’ బకాయిల సస్పెన్స్:

   మరోవైపు అడిషనల్ రిజర్వ్ (AR) విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి రావాల్సిన ప్రయాణ భత్యం (TA) బకాయిలు కూడా దీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉన్నాయి. తమకు రావాల్సిన అలవెన్సులు వెంటనే విడుదలయ్యేలా బాస్ చర్యలు తీసుకోవాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి.

 నూతన భవనం, స్టేషన్ల ఏర్పాటు:

   కమిషనరేట్ పరిధిలో నిర్మించిన నూతన ‘కమాండ్ కంట్రోల్ భవనం’ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీంతో పాటు ప్రజల సౌకర్యార్థం నూతనంగా ప్రతిపాదించిన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంది.

 ల్యాండ్ మార్క్ బదిలీలు:

   ఒకే చోట సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎస్సైలు, సీఐలకు సంబంధించి రూల్స్ ప్రకారం నిర్వహించాల్సిన బదిలీల ప్రక్రియ కూడా ఇంకా కొలిక్కి రాలేదు.

ఈ నేపథ్యంలో, కమిషనరేట్‌లో పేరుకుపోయిన ఈ పోస్టింగ్‌ల ఖాళీలు, సిబ్బంది సమస్యలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభంపై పోలీస్ బాస్ తన పర్యటనలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని పరిష్కారం చూపిస్తారని సర్వత్రా ఆశిస్తున్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles