KNRUHS: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) MBBS, BDS కోర్సుల్లో ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీల కింద ప్రవేశాలు కోరుతున్న అభ్యర్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది. పర్సన్స్ విత్ డిజెబిలిటీ (PwD), చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ (CAP) కేటగిరీలకు సంబంధించిన భౌతిక పరీక్షలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన తేదీలను యూనివర్సిటీ ప్రకటించింది.
ఆగస్టు 13, 14న PwD అభ్యర్థుల పరిశీలన:
PwD కేటగిరీ కింద MBBS, BDS ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 13, 14 తేదీల్లో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ హైదరాబాద్‌లోని NIMS పాత OPD బ్లాక్‌లో ఉన్న లెర్నింగ్ సెంటర్, మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. అభ్యర్థులు నిర్ణీత సమయానికి తల్లిదండ్రులు లేదా గార్డియన్‌తో కలిసి హాజరు కావాలి.
అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు యూనివర్సిటీ సూచించిన ఇతర అవసరమైన పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి. అవసరాన్ని బట్టి న్యూరాలజీ, ఆఫ్తాల్మాలజీ, ENT, హెమటాలజీ వంటి విభాగాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాల్సి రావచ్చు. అలాంటి అభ్యర్థులను తదుపరి తేదీల్లో అదనపు పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచించవచ్చు.
CAP అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన:
చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ (CAP) కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా ఆగస్టు 13, 14 తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్, సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో జరుగుతుంది.CAP అభ్యర్థులు కూడా తల్లిదండ్రులు లేదా గార్డియన్‌తో కలిసి హాజరు కావాలి. నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాకపోతే CAP కేటగిరీ కింద ప్రవేశానికి సంబంధించిన క్లెయిమ్‌ను కోల్పోయే అవకాశం ఉందని KNRUHS స్పష్టం చేసింది.


