HomeWarangal Newsమత సామరస్యమే ప్రజా పాలనకు బలం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

మత సామరస్యమే ప్రజా పాలనకు బలం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Published on

spot_img

హనుమకొండ: మత సామరస్యాన్ని, సోదరభావాన్ని కాపాడుతూ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే ప్రజా పాలన ముఖ్య ఉద్దేశమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

 హనుమకొండలో కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ మత గురువులు, మత పెద్దలతో ఆయన రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పూర్తి స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

స్థల కేటాయింపు – సమస్యల పరిష్కారానికి హామీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని ಮಾತనాడూ, వరంగల్ నగరంలో ప్రతి ఒక్కరి మత విశ్వాసాలను, సిద్ధాంతాలను గౌరవిస్తూ ముందుకు సాగడమే తన విధానమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో క్రైస్తవ సోదరుల మౌలిక అవసరాల కోసం 3 ఎకరాల స్థలాన్ని కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికలు, మౌలిక వసతులకు సంబంధించిన స్థానిక సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తానని, రాష్ట్రస్థాయి అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.

సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత

క్రైస్తవులు, మైనారిటీల సంక్షేమం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడేది కాదని, అది వారి హక్కు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, చర్చిల నిర్మాణం/మరమ్మతులు, విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు వంటి పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కులమతాల తేడా లేదని, భవిష్యత్తులో కూడా క్రైస్తవ సోదరుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇలాంటి సమావేశాలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే నాయిని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో త్రినగర పరిధిలోని పలువురు పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు, సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles