HomeLatest Newsతెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్..ఆగస్ట్‌ 15న ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే!

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్..ఆగస్ట్‌ 15న ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే!

Published on

spot_img

తెలంగాణ: ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంక్షేమ పథకాల విస్తరణకు వేదికగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 15 సందర్భంగా కొత్త లబ్ధిదారులను పథకాల పరిధిలోకి తీసుకురావడంతో పాటు పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు:

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 41 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. తాజాగా తలసీమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా బాధితులను కూడా పింఛన్‌ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం 11 కేటగిరీల్లో మరో 2.25 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.

5 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్:

మహాలక్ష్మి పథకంలోని రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని కొత్తగా రేషన్ కార్డులు పొందే కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 5 లక్షల కుటుంబాలకు ఈ ప్రయోజనం అందే అవకాశం ఉంది.

ఉచిత విద్యుత్ పరిధిలోకి కొత్త కుటుంబాలు:

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రస్తుతం సుమారు 50 లక్షల కుటుంబాలకు అందుతోంది. కొత్త రేషన్ కార్డుదారుల్లో మరో 3 నుంచి 4 లక్షల కుటుంబాలు ఈ పథకంలో చేరే అవకాశం ఉంది.

ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు:

రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. స్మార్ట్ కార్డుల పంపిణీతో పాటు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

TIMS ప్రారంభం.. అభివృద్ధి పనులపై ఫోకస్:

సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (TIMS)ను ఆగస్టు 15న ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూసీ పునరుజ్జీవనం, గాంధీ సరోవర్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులపై కూడా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.