HomeCulture & Lifestyleఫోన్ ఛార్జింగ్ కోసం పబ్లిక్ పోర్ట్ వాడుతున్నారా..? ఈ సైబర్ స్కామ్‌తో జాగ్రత్త..!

ఫోన్ ఛార్జింగ్ కోసం పబ్లిక్ పోర్ట్ వాడుతున్నారా..? ఈ సైబర్ స్కామ్‌తో జాగ్రత్త..!

Published on

spot_img

ఫోన్ ఛార్జింగ్ కోసం పబ్లిక్ పోర్ట్ వాడుతున్నారా..? ఈ సైబర్ స్కామ్‌తో జాగ్రత్త..:

రిమోట్ వర్క్, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు పెరగడంతో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వినియోగం భారీగా పెరిగింది. ఉద్యోగం, వ్యక్తిగత అవసరాల కోసం ప్రయాణించే సమయంలోనూ వీటిని వెంట తీసుకెళ్లడం సాధారణమైంది. అయితే ప్రయాణాల్లో ఫోన్ లేదా ల్యాప్‌టాప్ బ్యాటరీ అయిపోతే పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లను ఉపయోగించడం ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో చాలామంది వీటిని ఆశ్రయిస్తుంటారు. అయితే ఇలాంటి యూఎస్‌బీ పోర్ట్‌లను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జ్యూస్ జాకింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసా?:

పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌ను ఉపయోగించుకుని ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి అనధికారికంగా చొరబడే సైబర్ దాడిని సాధారణంగా ‘జ్యూస్ జాకింగ్’ అంటారు. యూఎస్‌బీ కనెక్షన్ ద్వారా కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా డేటాను కూడా బదిలీ చేయవచ్చు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే నేరగాళ్లు ఛార్జింగ్ పాయింట్లలో మార్పులు చేయడం లేదా నకిలీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు.

దీని ద్వారా పరికరంలోకి హానికరమైన సాఫ్ట్‌వేర్ చేరే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సమాచారం, ఫైళ్లు, ఇతర సున్నితమైన డేటాను దొంగిలించేందుకు ప్రయత్నాలు జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో బ్యాంకింగ్ వివరాలను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంటుంది.

ఫోన్ డేటా భద్రత కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి:

పబ్లిక్ యూఎస్‌బీ పోర్ట్‌లకు బదులుగా సొంత ఛార్జింగ్ అడాప్టర్, కేబుల్‌ను వెంట తీసుకెళ్లడం మంచిది. వీలైతే నేరుగా ఎలక్ట్రికల్ సాకెట్‌ నుంచి ఛార్జింగ్ చేసుకోవాలి. అలాగే ప్రయాణాల్లో నాణ్యమైన పవర్ బ్యాంక్‌ను ఉపయోగించడం సురక్షితమైన మార్గం. పబ్లిక్ యూఎస్‌బీ పోర్ట్‌కు కనెక్ట్ చేసినప్పుడు డేటా యాక్సెస్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ లేదా ‘ఈ పరికరాన్ని విశ్వసించండి’ వంటి అనుమతులు కోరితే వాటిని అనవసరంగా అంగీకరించకూడదు.

అదనంగా యూఎస్‌బీ డేటా బ్లాకర్‌ను ఉపయోగించవచ్చు. ఇది యూఎస్‌బీ ద్వారా డేటా బదిలీని నిరోధించి, ఛార్జింగ్‌కు అవసరమైన విద్యుత్ సరఫరాను మాత్రమే అనుమతిస్తుంది. అత్యవసరం కానప్పుడు పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లకు దూరంగా ఉండటమే ఉత్తమమైన భద్రతా చర్య.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం.. శివనామస్మరణతో మార్మోగనున్న ఆలయాలు!

నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభమైంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు జరిగే ఈ మాసంలో నాగుల చవితి, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలు రానున్నాయి.

తెలంగాణ సాంస్కృతిక వైభవం: నేడే ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో సంబరాలు షురూ!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రతీక అయిన తొమ్మిది రోజుల పూల పండుగ బతుకమ్మ వేడుకలు ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు విశిష్టత, పూల అమరిక, వాయనం మరియు నైవేద్యాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

అమ్మ బాబోయ్..భోజనం తర్వాత నడవకపోతే ఇన్ని నష్టాలా..?

భోజనం చేసిన వెంటనే కాకుండా కొద్దిసేపటి తర్వాత నడవడం జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. భోజనం తర్వాత అసలు నడవకపోతే కలిగే ప్రభావాలు ఏంటో తెలుసుకోండి.