ఫ్రీ పైలట్ ట్రైనింగ్: పైలట్ కావాలనుకునే యువతులకు ఇది మంచి అవకాశం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు IndiGoReach – Giving Wings to Fly కార్యక్రమం ద్వారా కమర్షియల్ పైలట్‌గా శిక్షణ పొందే అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ ఇంటర్ విద్యాశాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన యువతులను పైలట్ కెరీర్ వైపు ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణ:
ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు Commercial Pilot Licence (CPL) కోసం అవసరమైన పూర్తి స్థాయి శిక్షణ అందిస్తారు. దీంతో పాటు ATR Type Rating శిక్షణ కూడా ఇస్తారు. పైలట్ శిక్షణకు అవసరమైన ప్రధాన ఖర్చులకు కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది.
వసతి, భోజనం.. మెడికల్ ఇన్సూరెన్స్:
శిక్షణ సమయంలో అభ్యర్థులకు వసతి, భోజనం సదుపాయాలతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. అంతేకాకుండా మెంటర్షిప్, కెరీర్ గైడెన్స్ అందించి విమానయాన రంగంలో కెరీర్‌కు అవసరమైన మార్గదర్శకత్వం ఇస్తారు.
ఎవరు అర్హులు?:
10+2లో ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 51 శాతం మార్కులు సాధించిన మహిళా అభ్యర్థులు అర్హులు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువతులకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం ఉంటుంది.
ఆన్లైన్లో దరఖాస్తు:
అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక దరఖాస్తు పోర్టల్ https://indigoreachgwf.scholarsbox.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ముందు అర్హతలు, అవసరమైన పత్రాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారిక పోర్టల్‌లో పరిశీలించడం మంచిది.


