HomeLatest Newsరవీంద్రభారతిలో కోలాహలంగా బీఈఏటీ విజన్ మీట్–2026

రవీంద్రభారతిలో కోలాహలంగా బీఈఏటీ విజన్ మీట్–2026

Published on

spot_img

హైదరాబాద్: బైండ్ల సమాజం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరింత ముందంజ వేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు, యువత ఉన్నత విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

 హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ‘తెలంగాణ బైండ్ల ఉద్యోగుల సంఘం’ (BEAT) ఆధ్వర్యంలో నిర్వహించిన “విజన్‌ మీట్‌–2026” కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను నేడు పార్లమెంట్‌ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించడానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ ఫలాలే కారణమని పేర్కొన్నారు. కేవలం కులవృత్తి ద్వారా తాత్కాలిక ఆదాయం వస్తోందనే కారణంతో పిల్లల చదువులను మధ్యలోనే ఆపేయవద్దని, ప్రతి ఒక్కరూ ఉన్నత, వృత్తి విద్యలను అభ్యసించాలని ఆకాంక్షించారు. 

ముఖ్యంగా ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి, వారు జీవితంలో సొంతకాళ్లపై నిలబడేలా ప్రోత్సహించాలని కోరారు. సమాజం ద్వారా ఎదిగిన ప్రతి ఒక్కరూ ‘పే బ్యాక్‌ టు సొసైటీ’ స్ఫూర్తితో వెనుకబడిన వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

బైండ్ల భవన్‌కు రూ.2 కోట్ల నిధులు

హైదరాబాద్‌లో బైండ్ల భవన్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని తాను, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విన్నవించినట్లు ఎంపీ తెలిపారు. తొలి విడతగా సుమారు రూ.2 కోట్ల నిధులు కేటాయించాలని కోరామని, త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక జీవో (GO) వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

గ్రూపులు వీడి ఒక్కటిగా ముందడుగు వేయాలి

బీఈఏటీ (BEAT) సంస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బైండ్ల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువతను ఒకే తాటిపైకి తీసుకురావాలని సూచించారు. సంఘంలో ఎలాంటి గ్రూపులు, విభేదాలకు తావులేకుండా అందరూ సమైక్యంగా ముందుకు సాగాలని, సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించి సభ్యత్వాన్ని పెంచాలని కోరారు. బైండ్ల సమాజాభివృద్ధికి బీఈఏటీ వేదికగా నిలవాలని స్పష్టం చేశారు.

తన కుటుంబానికి పెద్దగా ఆస్తులు, ఆర్థిక వనరులు లేకపోయినా నిజాయితీ, ప్రజాబలమే పెట్టుబడి అని ఎంపీ అన్నారు. తన తండ్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా, తాను ఎంపీగా ప్రజాసేవలో ఉన్నామని, రాజకీయ పదవులు ఉన్నా లేకపోయినా సమాజ శ్రేయస్సుకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ విజన్ మీట్ కార్యక్రమంలో బీఈఏటీ అధ్యక్షుడు చినపాక స్వామి, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, కోశాధికారి డా. జీలకర్ర స్వామి, సంయుక్త కార్యదర్శి జీలకర్ర రామ్‌మూర్తి, ముఖ్య సలహాదారు కడెం ధనుంజయ, సలహాదారులు డా. జీలకర్ర సోమశేఖర్, చినపాక శ్రీనివాస ప్రసాద్, ఏ. ప్రదీప్ కుమార్ తదితర సంఘ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.