నల్లబెల్లి (నర్సంపేట): ఇటీవల అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ధీర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఓదార్చారు. నల్లబెల్లి గ్రామంలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి స్వయంగా చేరుకున్న కేసీఆర్, అక్కడ సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునయనాలతో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శోకసంద్రంలో ఉన్న పెద్ది కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేసీఆర్, వారిని ఓదార్చి కొండంత ధైర్యాన్ని నూరిపోశారు. సుదర్శన్ రెడ్డి పార్టీకి అందించిన సేవలను, ఆయనతో తనకున్న పేగుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఏ కష్టం వచ్చినా పార్టీ సదా అండగా ఉంటుందని స్పష్టం చేసిన కేసీఆర్, పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
దారిపొడవునా కార్యకర్తల నీరాజనాలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీ ఎత్తున నేతలు, శ్రేణులు, పెద్ది అభిమానులు నల్లబెల్లికి తరలివచ్చారు. కేసీఆర్‌కు దారిపొడవునా గులాబీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. నర్సంపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


