నాగార్జున సాగర్ వరుణ యాగం ఎందుకు నిర్వహిస్తున్నారు?
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తగ్గి, నాగార్జున సాగర్ వరుణ యాగం తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన వరుణ యాగం వైభవంగా ప్రారంభమైంది.
నాగార్జున సాగర్ వద్ద వరుణ యాగం ప్రారంభం
నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదీ తీరాన వేకువజామున 4:05 గంటలకు పండితులు గోపూజతో ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల హాజరు
ఈ ప్రత్యేక యాగానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మధ్యాహ్నం 2:45 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్‌కు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:24 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

