యూనియన్ బ్యాంక్‌లో 395 ఉద్యోగాలు: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) కీలక అవకాశం ప్రకటించింది. వివిధ విభాగాల్లో మొత్తం 395 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ ఆఫీసర్లు, డొమైన్ ఎక్స్‌పర్ట్స్ తదితర పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు గడువు నేటితో అంటే ఆగస్టు 10, 2026తో ముగియనుంది.
పోస్టుల వివరాలు :
యూనియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్‌లో మేనేజర్ (MMGS-II) పోస్టులు 163, సీనియర్ మేనేజర్ (MMGS-III) పోస్టులు 153, చీఫ్ మేనేజర్ (SMGS-IV) పోస్టులు 52, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (SMGS-V) పోస్టులు 20, డిప్యూటీ జనరల్ మేనేజర్ (TEGS-VI) పోస్టులు 7 ఉన్నాయి.
విద్యార్హతలు :
పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీకామ్, బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంటెక్, ఎంఎస్సీ వంటి అర్హతలు ఉన్నవారు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి :
అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 22 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు :
యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,180 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.177 ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.
జీతం, ఎంపిక విధానం :
ఈ పోస్టులకు ఎంపికైన వారికి పోస్టును బట్టి రూ.64,820 నుంచి రూ.1,56,500 వరకు జీతం లభిస్తుంది. అభ్యర్థుల ఎంపికలో ఆన్‌లైన్ పరీక్ష, అవసరాన్ని బట్టి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి దశలు ఉంటాయి.
ముఖ్య గమనిక: దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 10, 2026. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక వెబ్‌సైట్: www.unionbankofindia.bank.in


