HomeLatest Newsవరంగల్‌ జిల్లాలో పెరిగిన జన్‌ధన్‌ ఖాతాలు.. లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర మంత్రి...

వరంగల్‌ జిల్లాలో పెరిగిన జన్‌ధన్‌ ఖాతాలు.. లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

Published on

spot_img

వరంగల్ జిల్లాలో జన్‌ధన్ ఖాతాలు గణనీయంగా పెరిగాయి. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PMJDY) పథకం ద్వారా వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణ, ఖాతాల నిర్వహణపై వరంగల్ లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సోమవారం పార్లమెంట్‌లో ప్రశ్నలు గుప్పించారు. గత మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా ఆర్థిక సేవల పరిస్థితి, జన్‌ధన్ ఖాతాల సంఖ్య, రూపే కార్డుల జారీ, ఆధార్‌ అనుసంధానం, డీబీటీ ప్రయోజనాలు మరియు డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకంపై ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరారు.

​ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కేంద్ర మంత్రి సమాధానంలోని ముఖ్యాంశాలు:

వరంగల్‌ జిల్లాలో పీఎంజేడీవై ఖాతాల సంఖ్య మార్చి 2024 నాటికి 2,69,894 ఉండగా, మార్చి 2026 నాటికి అవి 3,02,317కు పెరిగాయి. ఆధార్‌తో లింక్ అయిన ఖాతాల సంఖ్య 2,18,133 నుంచి 2,65,470కు చేరింది.

​రూపే కార్డులు: జారీ చేసిన రూపే డెబిట్ కార్డుల సంఖ్య 2,12,030 నుంచి 2,26,409కు పెరిగింది. ఖాతాల సంఖ్య పెరిగినప్పటికీ, నిరంతరం వినియోగంలో ఉన్న (ఆపరేటివ్) ఖాతాల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. మార్చి 2024లో 2,28,257 ఆపరేటివ్ ఖాతాలు ఉండగా, మార్చి 2026 నాటికి ఆ సంఖ్య 2,20,607కు తగ్గింది.

పీఎంజేడీవై ఖాతాలకు అనుసంధానమైన ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాల డేటాను కేంద్ర స్థాయిలో ప్రత్యేకంగా నిర్వహించడం లేదని మంత్రి తెలిపారు.

ఖాతాల వినియోగంపై దృష్టి సారించాలి: ఎంపీ డా. కడియం కావ్య

కేంద్ర మంత్రి సమాధానంపై ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పందిస్తూ.. జిల్లాలో జన్‌ధన్ ఖాతాల సంఖ్య పెరగడం శుభపరిణామమే అయినప్పటికీ, ఆపరేటివ్ ఖాతాల సంఖ్య తగ్గడం ఆందోళనకరమన్నారు. కేవలం ఖాతాలు తెరవడమే కాకుండా అవి నిరంతరం వినియోగంలో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

​ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేదలు, మహిళలు, రైతులు, కూలీలు మరియు చిన్న వ్యాపారులకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంచి, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, వరంగల్ జిల్లాలో బ్యాంకింగ్ మౌలిక వసతులను బలోపేతం చేసి అర్హులందరికీ డీబీటీ ప్రయోజనాలు అందేలా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఎంపీ కావ్య డిమాండ్ చేశారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.