HomeWarangal Newsతెలంగాణ ధిక్కార స్వరం కాళోజీ : సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె. నారాయణ

తెలంగాణ ధిక్కార స్వరం కాళోజీ : సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె. నారాయణ

Published on

spot_img

హనుమకొండ: తన రచనలతో తెలంగాణ ప్రజా గొంతుకై నిలిచిన ధిక్కార స్వరం కాళోజీ నారాయణరావు అని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ కొనియాడారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలసి ఆయన హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

​అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ— ప్రాంతీయులే దోపిడీకి పూనుకుంటే వారిని పాతరేయాలన్న కాళోజీ కవితా సందేశాన్ని తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో నిజం చేశారని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక పాలన సాగించినందుకే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు.

​గతంలో 2014లో ఈ ఆడిటోరియం శంకుస్థాపన కార్యక్రమానికి తాను హాజరైన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

​ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, నాయకులు మేకల రవి, పంజాల రమేష్, ఎన్.ఎ. స్టాలిన్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు ల్యాదల్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles