హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత ఘనంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అక్కడ హాజరైన వారందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ— దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహానీయుల, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు అమూల్యమైనవని స్మరించుకున్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ALSO READ: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.


