వరంగల్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా చారిత్రక ఖిలా వరంగల్ లోని కుష్ మహల్ ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పోలీసుల గౌరవ వందనం
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మంత్రి కొండ సురేఖ పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పాల్గొన్న ఉన్నతాధికారులు
ఈ వేడుకల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవం: ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
కార్యక్రమం చివరలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాల పంపిణీ ఉత్సాహభరితంగా సాగింది.


