నక్షత్రపై రవితేజ వ్యాఖ్యలు వైరల్.. ‘మీ అమ్మాయిని అంటే ఊరుకుంటారా?’:
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రి–కూతుళ్ల అనుబంధాన్ని ప్రధానంగా చూపించనున్న ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర.. రవితేజ కూతురి పాత్రలో కనిపించనుంది.
‘మల్లెపూల పల్లకి’ పాట విడుదల:
సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం ఆగస్టు 16న ‘మల్లెపూల పల్లకి’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో రవితేజతో పాటు చిన్నారి నక్షత్ర కూడా సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె రవితేజను కొన్ని సరదా ప్రశ్నలు అడిగింది.
ప్రశ్నకు రవితేజ సమాధానం:
“నాకు ముద్దుపేరు పెట్టాలంటే ఏం పెడతారు?”అని నక్షత్ర రవితేజను అడిగింది. కాసేపు ఆలోచించిన రవితేజ.. సరదాగా అభ్యంతరకరమైన పదాన్ని ఉపయోగించి సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడున్న వారు నవ్వారు. అయితే ఆ పదానికి అర్థం ఏమిటని నక్షత్ర ప్రశ్నించడంతో రవితేజ “తర్వాత చెబుతానులే” అంటూ మాట దాటవేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవితేజ చేసిన వ్యాఖ్యపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.


