బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని, పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ALSO READ: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలుబడుగు బలహీన వర్గాల సమానత్వం కోసం పోరాడిన యోధుడు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల హక్కులు, సమానత్వం కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. దొరలు, పెత్తందార్ల ఆధిపత్యానికి మరియు అణచివేతకు ఎదురొడ్డి పోరాడిన వీరుడని పేర్కొన్నారు.
బడుగులను ఐక్యం చేసి, ఒక ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన పాపన్న గౌడ్ చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం ప్రతినిధులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

