HomeWarangal Newsవరంగల్ భద్రకాళి బండ్‌లో కొత్త సౌకర్యం.. బ్యాటరీ వెహికల్ సేవలు షురూ!

వరంగల్ భద్రకాళి బండ్‌లో కొత్త సౌకర్యం.. బ్యాటరీ వెహికల్ సేవలు షురూ!

Published on

spot_img

వరంగల్ భద్రకాళి బండ్‌లో కొత్త సౌకర్యం.. బ్యాటరీ వెహికల్ సేవలు షురూ:

వరంగల్: భద్రకాళి బండ్‌ను సందర్శించే ప్రజల సౌకర్యార్థం బ్యాటరీ వెహికల్ సేవలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఈ సేవలను ప్రారంభించారు.

ప్రజలకు అందుబాటులో బ్యాటరీ వెహికల్:

బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్‌ను ప్రారంభించిన అనంతరం కుడా సీపీఓ అజిత్ రెడ్డి వాహనాన్ని నడిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్నతో పాటు పలువురు అధికారులు బ్యాటరీ వెహికల్‌లో భద్రకాళి బండ్‌పై ప్రయాణించారు.

కెనరా బ్యాంకు సహకారం:

కెనరా బ్యాంకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో కొనుగోలు చేసిన ఈ బ్యాటరీ వెహికల్‌ను కుడాకు అందజేసింది. ప్రజలు, పర్యాటకులు బండ్‌ పరిసరాలను సులభంగా సందర్శించేందుకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.

సందర్శకులకు మెరుగైన వసతులు:

భద్రకాళి బండ్‌కు వచ్చే సందర్శకుల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు వృద్ధులు, పిల్లలకు ఈ వాహనం మరింత అనుకూలంగా ఉండనుంది. కార్యక్రమంలో కుడా ఈఈ భీమ్‌రావు, కెనరా బ్యాంకు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles