HomeEntertainmentరజినీకాంత్ అల్లుడిగా టాలీవుడ్ స్టార్ హీరో..? వైరల్ అవుతున్న న్యూస్!

రజినీకాంత్ అల్లుడిగా టాలీవుడ్ స్టార్ హీరో..? వైరల్ అవుతున్న న్యూస్!

Published on

spot_img

రజినీకాంత్ అల్లుడిగా టాలీవుడ్ స్టార్ హీరో..? వైరల్ అవుతున్న న్యూస్:

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధర్మన్’పై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రజినీకాంత్‌కు అల్లుడిగా రామ్?:

‘ధర్మన్’లో రజినీకాంత్ మామ పాత్రలో కనిపించనుండగా, సిమ్రన్ ఆయన భార్యగా నటిస్తున్నట్లు సమాచారం. వీరి కుమార్తె పాత్రను రాశీ ఖన్నా పోషించనున్నారని, ఆమెకు జోడీగా రామ్ పోతినేని కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన రామ్.. రజినీకాంత్‌కు అల్లుడి పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.

విలన్‌గా టాలీవుడ్ హీరో?:

మరోవైపు ఈ చిత్రంలో రామ్ పోతినేని ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారనే వార్త కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఈ విషయంపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో, రామ్ పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

చెన్నైలో షూటింగ్:

అశ్విత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ‘ధర్మన్’ ప్రస్తుతం చెన్నైలో రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. రామ్ పోతినేని సినిమా టీమ్‌లో చేరికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే రజినీకాంత్‌తో రామ్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.