HomeWarangal Newsకాకతీయ యూనివర్సిటీకి 50 ఏళ్లు..ఐదు దశాబ్దాల ప్రస్థానం ఇదే!

కాకతీయ యూనివర్సిటీకి 50 ఏళ్లు..ఐదు దశాబ్దాల ప్రస్థానం ఇదే!

Published on

spot_img

కాకతీయ యూనివర్సిటీకి 50 ఏళ్లు..ఐదు దశాబ్దాల ప్రస్థానం ఇదే:

వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీ (కేయూ) గురువారం (ఆగస్టు 20) 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఐదు దశాబ్దాలుగా ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో సేవలందిస్తున్న వర్సిటీ.. స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 1976 ఆగస్టు 20న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వర్సిటీ పరిపాలన భవనానికి శంకుస్థాపన చేశారు.

పోస్టుగ్రాడ్యుయేషన్‌ సెంటర్‌ నుంచి వర్సిటీగా:

కాకతీయ యూనివర్సిటీకి 1968లో సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా పోస్టుగ్రాడ్యుయేషన్‌ సెంటర్‌గా పునాది పడింది. అప్పట్లో తెలుగు, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌ విభాగాలతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అనంతరం 1976లో కాకతీయ యూనివర్సిటీగా అవతరించింది. ప్రస్తుతం సామాజిక శాస్త్రాలు, సైన్స్‌, కామర్స్‌, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్‌, ఎడ్యుకేషన్‌ తదితర విభాగాల్లో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

ఐదు దశాబ్దాల ప్రస్థానం:

50 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని పురస్కరించుకుని 2025లో తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణతో స్వర్ణోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. విద్యతో పాటు పరిశోధన, ఆవిష్కరణలు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పరిపాలనలోనూ పలు సంస్కరణలు చేపడుతున్నారు.

పెరిగిన నిధులు.. అభివృద్ధికి ఊతం:

కేయూకు ప్రభుత్వం అందిస్తున్న బ్లాక్‌ గ్రాంట్‌ను ఈ ఏడాది పెంచింది. ప్రభుత్వ నిధుల సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని విద్య, పరిశోధన రంగాల్లో సహకారాన్ని పెంచుతున్నారు.

కొత్త సిలబస్‌తో నైపుణ్యాలపై దృష్టి:

నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సుల్లో కొత్త సిలబస్‌ను అమలు చేస్తున్నారు. డిజిటల్‌ విద్యా సదుపాయాలను విస్తరిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నారు. ఇటీవల సుమారు 800 మందికి ప్లేస్‌మెంట్‌ అవకాశాలు కల్పించారు. రూసా నిధులతో పరిశోధన కేంద్రాల అభివృద్ధి, కేహబ్‌ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు.

విస్తృతంగా కేయూ సేవలు:

కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రాంతాలు ఉన్నాయి. నిర్మల్‌, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లోని పీజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తోంది. గ్రంథాలయం, హాస్టళ్లు, రహదారులు, ఆప్టికల్‌ ఫైబర్‌ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ.. అకడమిక్‌ బ్లాక్‌లు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌ హాళ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. 50 ఏళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కేయూ ముందుకు సాగుతోంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles