HomeWarangal Newsప్రపంచ దోమల దినోత్సవం.. వరంగల్‌లో అధికారుల అవగాహన ర్యాలీ..!

ప్రపంచ దోమల దినోత్సవం.. వరంగల్‌లో అధికారుల అవగాహన ర్యాలీ..!

Published on

spot_img

ప్రపంచ దోమల దినోత్సవం.. వరంగల్‌లో అధికారుల అవగాహన ర్యాలీ..:

ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొమ్మన రాజారెడ్డి ఆధ్వర్యంలో ఎంహెచ్ నగర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇటీవల డెంగ్యూ కేసులు నమోదైన నేపథ్యంలో స్థానికులకు కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించారు.

డెంగ్యూ, మలేరియా నివారణపై సూచనలు:

వైద్య, మున్సిపల్ సిబ్బంది కాలనీలో ర్యాలీ నిర్వహించి ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అవగాహనతోనే వ్యాధుల నియంత్రణ:

ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ.. సర్ రోనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20న ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని నిర్ధారించిన సందర్భంగా ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మలేరియా అధికారి కె. రజిని మాట్లాడుతూ కీటక జనిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వాటిని నియంత్రించవచ్చన్నారు. వైద్య సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే నిర్వహించాలని, యాంటీ లార్వల్ ఆపరేషన్లు చేపట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్ కుమార్, మాజీ కార్పొరేటర్ సురేష్ జోషి, సబ్ యూనిట్ ఆఫీసర్ కుమారస్వామి, హెచ్‌ఈఓ సదానందం, హెల్త్ సూపర్‌వైజర్ మధుకర్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles