హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా అక్రమ పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ టాస్క్ఫోర్స్ అధికారులు కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధు తండా శివారులో ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక పాత మూసివేసిన షట్టర్ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన 152 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న బియ్యం మొత్తం బరువు 77.70 క్వింటాళ్లు కాగా, వీటి మార్కెట్ విలువ సుమారు ₹2,71,950 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. జప్తు చేసిన బియ్యాన్ని తదుపరి చర్యల నిమిత్తం కేయూ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

