వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యాంశాలు:
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్ వ్యాఖ్యలు
* సీఎం రేవంత్ రెడ్డికి సుస్మిత పటేల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
* వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీసీ నాయకులను అణగదొక్కడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు.
* పార్టీ కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్న కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయించి భయాందోళనలకు గురిచేస్తున్నారు.
* మంత్రి కొండా సురేఖ బీసీ మహిళ అయి ఉండి కూడా స్థానిక బీసీ నాయకులను తొక్కేస్తున్నారాని ఆరోపించారు.
* 350 గొర్రెల సజీవ దహనం ఘటనకు బాధ్యులెవరో సమాధానం చెప్పాలి.
* పార్టీ కోసం కష్టపడే వారిపై పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించి రౌడీషీట్లు ఓపెన్ చేయిస్తున్నారు.
* బీసీ నినాదాన్ని వాడుకుంటూ తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
* నియోజకవర్గంలో అభివృద్ధి సున్నా అని, కేవలం కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
నల్గొండ నరేష్ వ్యాఖ్యలు
* కొండా సురేఖ తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
* ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కొండా దంపతులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.
* బీసీలను అడ్డుపెట్టుకుని తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు.
* స్థానిక నాయకులకు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా చేశారు.
* నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారని, రెండవ బీసీ నాయకుడు ఎదగకుండా అణచివేస్తున్నారని మండిపడ్డారు.
మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ వ్యాఖ్యలు
* కొండ సుష్మిత పటేల్ వెంటనే సీఎంకు క్షమాపణ చెప్పాలి.
* కొమ్మాల జాతరలో కొండ మురళి సుస్మిత పటేల్ పరకాల నుంచి పోటీ చేస్తారని ప్రకటించడానికి ఆయనకు ఏ హోదా ఉంది?
* కార్పొరేటర్ టికెట్లను ప్రకటించడానికి వారికెలాంటి అధికారమూ, అర్హత లేదు.
* క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న కొండా సురేఖను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి.
* మంత్రి పాలనపై ప్రజలు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు; బర్తరఫ్ వేడుకలు జరుపుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
* బీసీ కార్డుతో చిల్లర రాజకీయాలు చేస్తూ, బీసీ బిడ్డలపై ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
* రౌడీ రాజ్యాంగాన్ని నడుపుతూ, భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు; ఈ దౌర్జన్యాలు ఎక్కువ రోజులు సాగవు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


