HomeLatest Newsఎస్ఐ పేరుతో సైబర్ మోసం: వైన్స్ ఉద్యోగికి రూ.78,500 టోకరా

ఎస్ఐ పేరుతో సైబర్ మోసం: వైన్స్ ఉద్యోగికి రూ.78,500 టోకరా

Published on

spot_img

మహబూబాబాద్: పోలీస్ అధికారుల పేర్లు చెప్పి అమాయకులను ముంచేస్తున్న సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా నెల్లికుదురు సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ) పేరు చెప్పి ఓ వైన్స్ ఉద్యోగి వద్ద నుంచి రూ.78,500 కాజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.

​బాధితుడి కథనం ప్రకారం.. కేసముద్రం ప్రాంతానికి చెందిన సదరు బాధితుడికి అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను నెల్లికుదురు ఎస్ఐని అంటూ పరిచయం చేసుకున్న సదరు సైబర్ నేరగాడు, తన డ్రైవర్ రూ.25,000 నగదు ఇచ్చేందుకు మీ వద్దకు వస్తున్నాడని నమ్మబలికాడు. అత్యవసరం కాబట్టి ఆ మొత్తానికి బదులుగా తాను పంపిన క్యూఆర్ (QR) కోడ్‌కు వెంటనే డిజిటల్ పేమెంట్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరాడు.

​నిజమైన ఎస్ఐ అని నమ్మిన ఆ ఉద్యోగి, సదరు సైబర్ క్రిమినల్ పంపిన క్యూఆర్ కోడ్‌కు రెండు రోజుల వ్యవధిలో విడతల వారీగా రూ.78,500 పంపించాడు. ఆ తర్వాత ఎంతకీ నగదు ఇవ్వడానికి డ్రైవర్ రాకపోవడం, ఫోన్ చేసిన వ్యక్తి స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే అప్రమత్తమై సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ ‘1930’కి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

​అపరిచిత వ్యక్తులు అధికారులుగా పరిచయం చేసుకుని డబ్బులు పంపాలని కోరితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.