HomeWarangal Newsనెల రోజుల్లో అభివృద్ది పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

నెల రోజుల్లో అభివృద్ది పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Published on

spot_img

హనుమకొండ: పేదల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.1.19 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లోని అంతర్గత రహదారులు, మురుగునీటి పారుదల, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పనులకు కాలపరిమితిని నిర్దేశించి, నెల రోజుల్లోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జ్యోతిబాస్ నగర్‌లో మిగిలి ఉన్న గల్లీల్లోనూ ఈ నెలలోనే సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు, పింఛన్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ ఫలాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి కాలనీల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హనుమకొండ రాజేందర్, బాషాబోయిన కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, నాయకులు అంబేడ్కర్ రాజు, మాజీ కార్పొరేటర్ బొడ డిన్నతో పాటు పలువురు అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles