HomeWarangal Newsపగలు రెక్కీ..రాత్రికి చోరీలు..వరంగల్‌లో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్!

పగలు రెక్కీ..రాత్రికి చోరీలు..వరంగల్‌లో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్!

Published on

spot_img

పగలు రెక్కీ..రాత్రికి చోరీలు..వరంగల్‌లో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ :

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుడిని మిల్స్ కాలనీ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన 70.19 గ్రాముల బంగారు ఆభరణాలు, 527.9 గ్రాముల వెండి, రూ.29,875 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యేక బృందాలతో దర్యాప్తు :

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస చోరీలపై కేసులు నమోదయ్యాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విచారణ చేపట్టారు. గతంలో నమోదైన చోరీలను విశ్లేషించిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

పగలు రెక్కీ.. రాత్రి చోరీలు :

పెద్దపల్లికి చెందిన ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల (27) ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నివసిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. 2024, 2025లో మహారాష్ట్రలో నాలుగు చోరీలకు పాల్పడిన అతడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన అనంతరం కూడా నేరాల బాట వీడలేదు.

శివనగర్, ఎస్‌ఆర్‌ఆర్ నగర్‌లో చోరీలు :

ఈ ఏడాది మిల్స్ కాలనీ పరిధిలోని శివనగర్, ఎస్‌ఆర్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. వరంగల్ రైల్వే స్టేషన్‌లో అతడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ స్వామి, ఎస్‌ఐ మహేష్, ఏఏఓ సల్మాన్ పాషా, సీసీఎస్, మిల్స్ కాలనీ సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles