HomeLatest Newsతిరుమలలో ఇక ఆ వంటకాలు బంద్.. టీటీడీ సంచలన నిర్ణయం..!

తిరుమలలో ఇక ఆ వంటకాలు బంద్.. టీటీడీ సంచలన నిర్ణయం..!

Published on

spot_img

తిరుమల: తిరుమలకు వచ్చే భక్తులకు ఇకపై గోబీ వంటకాలు అందుబాటులో ఉండదు. క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉన్నాయంటూ భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీ ఆరోగ్య విభాగం అప్రమత్తమైంది. క్యాలీఫ్లవర్‌తో తయారు చేసే గోబీ రైస్, గోబీ 65, గోబీ మంచూరియా వంటి వంటకాలను తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నిలిపివేయాలని సూచించారు. నేటి నుండే ఇది అమల్లోకి వచ్చింది.

తనిఖీల్లో పురుగుల గుర్తింపు:

తిరుమలలో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని హోటళ్లలో క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో టీటీడీ హెల్త్ వింగ్ చర్యలకు సిద్ధమైంది. వారం రోజుల క్రితం హోటల్ నిర్వాహకులతో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ సమావేశమయ్యారు. ఈ సీజన్‌లో క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని, సరైన విధంగా శుభ్రం చేయకుండా వంటల్లో ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులను కూడా అధికారులు ప్రస్తావించారు.

అన్నదానంపై ఇంకా స్పష్టత లేదు:

ప్రస్తుతం ఆరోగ్య విభాగం సూచనలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రంలో క్యాలీఫ్లవర్ వినియోగంపై ఇంకా స్పష్టత రాలేదు. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తుండగా, దాతల నుంచి వచ్చే కూరగాయల్లో అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్ కూడా ఉంటుంది. టీటీడీ అధికారికంగా పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటే అన్నదానంలోనూ క్యాలీఫ్లవర్ వినియోగాన్ని నిలిపివేసే అవకాశం ఉంది. అవసరమైతే దాతల నుంచి ఆ కూరగాయను స్వీకరించకుండా చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.