రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్ :
తెలుగు రాష్ట్రాల్లో ‘టాక్సిక్’ చిత్రానికి స్పెషల్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ షోలకు టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం కండీషన్స్:
‘టాక్సిక్’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 4వ తేదీ వరకు సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. అయితే ఈ ధరల పెంపునకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి KVN ప్రొడక్షన్స్ తరఫున రూ.కోటి విరాళంగా అందించాలని సూచించింది. దీంతో పాటు డ్రగ్స్, నార్కోటిక్స్ వినియోగం, సైబర్‌క్రైమ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేలా థియేటర్ స్క్రీన్స్‌పై సంబంధిత ప్రకటనలను ప్రదర్శించాలని ఆదేశించింది.
పది రోజుల పాటు పెరిగిన ధరలు:
స్పెషల్ షోలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ‘టాక్సిక్’కు టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అనుమతి లభించింది. ఈ వెసులుబాటు పది రోజుల పాటు కొనసాగనుంది. దీంతో భారీ ఓపెనింగ్స్‌పై చిత్రబృందం ఆశలు పెట్టుకుంది.
బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే ‘టాక్సిక్’కు మంచి స్పందన కనిపిస్తోంది.


