HomeWarangal Newsనకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో హాస్టల్ యజమానులకు టోకరా: సైబర్ మోసగాడి అరెస్ట్

నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో హాస్టల్ యజమానులకు టోకరా: సైబర్ మోసగాడి అరెస్ట్

Published on

spot_img

హన్మకొండ: నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఆహార సరఫరా అవకాశాల పేరుతో హాస్టల్ యజమానులను బురిడీ కొట్టిస్తున్న ఒక అంతర్‌జిల్లా సైబర్ మోసగాడిని హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధిగా నమ్మిస్తూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన నిందితుడి నుంచి 3 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు, పాస్‌బుక్‌లు, ఏటీఎమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఐటీ ప్రతినిధిగా నమ్మిస్తూ మోసాలు

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిధి రామ్‌రెడ్డి నగర్‌లో నివసిస్తున్న మహమ్మద్ షబ్బీర్ (44) (అలియాస్ కిరణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, నర్సింహారెడ్డి) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతను హాస్టళ్ల బోర్డులపై ఉన్న మొబైల్ నంబర్లను సేకరించి యజమానులతో మాట్లాడేవాడు. తాను ప్రముఖ కంపెనీ ఉద్యోగినని, కంపెనీ సిబ్బందికి రోజువారీ భోజనం అందించే క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికేవాడు.

అగ్రిమెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, సామగ్రి కొనుగోలు నెపంతో బాధితుల నుంచి బ్యాంక్ ఖాతాలు, UPI ద్వారా భారీగా డబ్బులు బదిలీ చేయించుకునేవాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యేవాడు. ఇలా వసూలు చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడటంతో పాటు, ఆన్‌లైన్ గేమింగ్‌లో కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.

23 కేసులు.. రూ.36.99 లక్షల మోసం

దర్యాప్తులో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని 10 కేసులతో పాటు ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో నమోదైన మరో 7 కేసుల్లో ఇతని ప్రమేయం బయటపడింది. వీటితో పాటు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదైన 6 ఫిర్యాదులతో కలిపి మొత్తం రూ.36,99,000 మోసాలకు పాల్పడినట్లు తేలింది. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అందులో రూ.13,09,087 మొత్తాన్ని హోల్డ్ చేయించగలిగారు.

అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు

క్యాటరింగ్ కాంట్రాక్టులు లేదా ఉద్యోగాల పేరుతో వచ్చే అపరిచిత ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హన్మకొండ పోలీసులు సూచించారు. ముందస్తు రుసుములు, రిజిస్ట్రేషన్ల పేరుతో ఎవరికీ డబ్బులు బదిలీ చేయవద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్న హన్మకొండ సీఐ మచ్చ శివకుమార్, దర్యాప్తు బృంద సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles