దేశప్రజలకు హై అలర్ట్.. ఒక్కరోజే 114 స్వైన్ఫ్లూ కేసులు..:
దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 20 వరకు నగరంలో 1,777 హెచ్1ఎన్1 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 229 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఏడాది వ్యవధిలో కేసుల సంఖ్య ఆరు రెట్లకు పైగా పెరిగింది.
2,600 దాటిన ఇన్ఫ్లుయెంజా కేసులు :
ఢిల్లీలో ఇన్ఫ్లుయెంజా-ఏ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 2,392 ఇన్ఫ్లుయెంజా-ఏ కేసులు నమోదైనట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఇన్ఫ్లుయెంజా-ఏ, బీ కేసులను కలిపి చూస్తే మొత్తం సంఖ్య 2,602కు చేరింది. దీంతో నగరంలో వైరల్ ఫ్లూ వ్యాప్తిపై అధికారులు అప్రమత్తమయ్యారు.
ఒక్కరోజులోనే 114 హెచ్1ఎన్1 కేసులు :
కేసుల తీవ్రతకు తాజా గణాంకాలు అద్దం పడుతున్నాయి. ఆగస్టు 20వ తేదీన ఒక్కరోజే 114 హెచ్1ఎన్1 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి :
పిల్లలు, వృద్ధులు, గర్భిణులు స్వైన్ఫ్లూ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైనప్పుడు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఫ్లూ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


