తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల విద్యార్థుల కోసం బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) స్కీమ్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సమగ్ర కసరత్తు చేస్తోంది.
గత జూన్ నెలలో 8 జిల్లాల్లోని ఎంపిక చేసిన పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ పథకాన్ని, అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం సమర్థవంతమైన నిర్వహణ కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల (కేంద్రీకృత వంటశాలల) నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తోంది. ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందుతుండగా, ఈ విస్తరణ ద్వారా మొత్తం 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


