వరంగల్: విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆకాష్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న నేషనల్ టాలెంట్ హంట్ పరీక్ష ‘అంతే 2026’ ను ప్రారంభించారు. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ప్రతిభ కనబరిచే విద్యార్థులకు సుమారు రూ.2.5 కోట్ల విలువైన స్కాలర్షిప్లను అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
నీట్, జేఈఈ కోర్సులకు శిక్షణ:
హనుమకొండలోని ఆకాష్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ (అడ్మిషన్స్) అరబింద్, స్టేట్ హెడ్ అమిత్, బ్రాంచ్ హెడ్ రాజేష్ యాదవ్ వివరాలను వెల్లడించారు. పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి నగదు బహుమతులు కూడా అందిస్తామని తెలిపారు.
ఆన్లైన్, ఆఫ్లైన్లో పరీక్షలు:
9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్షలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించనున్నారు. ఆఫ్లైన్ పరీక్షలు అక్టోబర్ 11, 25, నవంబర్ 1 తేదీల్లో ఆకాష్ కేంద్రాలు, సంస్థ ఎంపిక చేసిన ఇతర కేంద్రాల్లో జరుగుతాయని తెలిపారు.
16 ఏళ్లుగా నిర్వహణ:
‘అంతే ’ పరీక్షను గత 16 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు కోటి మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. వేలాది మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాతీయ స్థాయిలో నీట్, జేఈఈలో మెరుగైన ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. వరంగల్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు కూడా గతంలో మంచి ఫలితాలు సాధించారని తెలిపారు.
విద్యార్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఆకాష్ ఆంథే అధికారిక https://anthe.aakash.ac.in/ వెబ్సైట్ సందర్శించండి


