హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ ఊపిరితిత్తులు, అన్నవాహిక, ఛాతీ మధ్యభాగం, డయాఫ్రమ్, ఛాతీ గోడకు సంబంధించిన వ్యాధులకు అధునాతన చికిత్స అందిస్తోంది. థొరాసిక్ సర్జరీలో గత పదేళ్లలో గణనీయమైన మార్పులు వచ్చాయని థొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి సి తెలిపారు. ప్రస్తుతం చిన్న కోతలతో, అవసరమైన సందర్భాల్లో రోబోటిక్ సర్జరీల ద్వారా చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు.
క్యాన్సర్‌కు సమగ్ర వైద్యం:
వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, ఆధునిక శస్త్రచికిత్సా పద్ధతులు, వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించవచ్చని ఆయన వివరించారు. అధునాతన ఆపరేషన్ థియేటర్లు, హై-డెఫినిషన్ ఇమేజింగ్, రోబోటిక్ సర్జికల్ ప్లాట్‌ఫామ్‌తో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
పలు ఛాతీ సమస్యలకు చికిత్స:
థొరాసిక్ సర్జన్లు, పల్మోనాలజిస్టులు, ఆంకాలజిస్టులు, రేడియాలజిస్టులు, అనస్థీషియాలజిస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం సేవలందిస్తోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక వ్యాధులు, ఛాతీలోని కణితులు, అత్యవసర పరిస్థితులకు మినిమల్లీ ఇన్వేసివ్ విధానాల్లో చికిత్స అందిస్తున్నారు.
ఊపిరితిత్తుల మార్పిడి సేవలు:
పల్మనరీ ఫైబ్రోసిస్, పల్మనరీ హైపర్‌టెన్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సేవలను కూడా అందిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ట్రాన్స్‌ప్లాంట్ అనంతరం రిహాబిలిటేషన్, క్రిటికల్ కేర్‌తో సమగ్ర సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది.
యశోద గ్రూప్ హైదరాబాద్‌లో నాలుగు ఆసుపత్రుల ద్వారా 4,000 పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందిస్తోంది. ఆధునిక సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపింది.


