హన్మకొండ సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజుకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసి చీరలను బహుమతిగా అందజేశారు. నియోజకవర్గంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.


