HomeWarangal Newsభూముల రీ సర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలి: కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

భూముల రీ సర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలి: కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

Published on

spot_img

హనుమకొండ: జిల్లాలోని గ్రామాల్లో చేపడుతున్న భూ రీ సర్వే వివరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.

సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా 70 గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే డేటా నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలు, రైతుల వారీగా పాలిగాన్ మ్యాప్‌లు మరియు ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా భూ కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, డీఐ సారంగపాణి రీ సర్వే పురోగతిని కలెక్టర్‌కు వివరిస్తూ.. సర్వేను మొత్తం 5 దశల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు:

  • మొదటి దశ: గ్రామ సరిహద్దుల నిర్ధారణ సర్వే
  • రెండవ దశ: గ్రామకంఠం సరిహద్దుల సర్వే
  • మూడవ దశ: ప్రభుత్వ కాలువలు, రోడ్లు, శిఖం భూముల సర్వే
  • నాలుగువ దశ: ప్రభుత్వ ఆస్తులు, పాఠశాలలు, ఆసుపత్రులు, అసైన్డ్ భూముల రీ సర్వే
  • ఐదవ దశ: పట్టాదారు భూముల రీ సర్వే

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేపడుతున్న ఈ భూ రీ సర్వే సమాచారం అత్యంత విలువైనదని, సాఫ్ట్‌వేర్ నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్వేయర్లు స్టాలిన్, విజయ్, సుజాతతో పాటు సంబంధిత శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles