వరంగల్: నగరంలోని ఆర్ఎన్‌టీ రోడ్డులో వరంగల్ డీసీసీబీ బ్యాంక్ కింద నందిని జ్యువెలర్స్ నూతన బ్రాంచ్‌ను సోమవారం ప్రారంభించారు. సంస్థ ప్రొప్రైటర్లు విశ్వనాథన్ శ్రీనివాస్ (గోల్డ్), విశ్వనాథన్ మణికంఠ రిబ్బన్ కట్ చేసి కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, కస్టమర్లు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
కస్టమర్లకు నచ్చిన డిజైన్లలో ఆభరణాలు :
నందిని జ్యువెలర్స్‌లో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వెండి, బంగారు ఆభరణాలను ఆర్డర్‌పై తయారు చేసి అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా 91.6 కేడియం బంగారు ఆభరణాలను నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ తయారు చేసి అందించనున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వివిధ రకాల డిజైన్లలో ఆభరణాలను రూపొందించే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
నాణ్యతతో పాటు అందుబాటు ధరలపై దృష్టి :
నాణ్యమైన, మన్నికైన బంగారు ఆభరణాలను సరసమైన ధరలకు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యాపారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. నగర ప్రజలు నందిని జ్యువెలర్స్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు.


