HomeWarangal Newsకాంగ్రెస్ 1000 రోజుల పాలనపై కడియం కావ్య సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై కడియం కావ్య సంచలన వ్యాఖ్యలు

Published on

spot_img

హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రోజుల ప్రజాపాలనను విజయవంతంగా పూర్తి చేసిందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట :

గత 32 నెలల్లో రైతుల కోసం ప్రభుత్వం రూ.1.68 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కావ్య తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేసి 25 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు విడుదల చేశామని, సన్నబియ్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌తో పాటు ఉచిత విద్యుత్, రైతు బీమా అమలు చేస్తున్నామని వివరించారు. యాసంగిలో 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని పేర్కొన్నారు.

మహిళలకు ఆర్థిక చేయూత :

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తున్నామని ఎంపీ తెలిపారు. గృహజ్యోతి ద్వారా 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 43 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతోందన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.60 వేల కోట్ల రుణాలు అందించామని చెప్పారు.

పేదలు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం :

15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి 3.38 కోట్ల మందికి పీడీఎస్ ద్వారా ప్రయోజనం అందిస్తున్నామని కావ్య పేర్కొన్నారు. 43 లక్షల మందికి పైగా పింఛన్లు అందుతుండగా, మరో 2.25 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తొలి విడతగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

విద్య, ఉద్యోగాలు, వైద్యంపై దృష్టి :

మెగా డీఎస్సీ ద్వారా 10 వేల ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశామని, తొలి 1000 రోజుల్లో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని ఎంపీ తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు వంటి చర్యలు చేపట్టామన్నారు.

కాంగ్రెస్‌పై ప్రజల విశ్వాసం పెరుగుతోంది :

బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని కావ్య విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం మరింత పెరుగుతోందని, రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles