HomeWarangal Newsసైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ సీపీ ఎన్. శ్వేత

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ సీపీ ఎన్. శ్వేత

Published on

spot_img

వరంగల్: సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని రూపొందించిన సైబర్‌ భద్రత అవగాహన పోస్టర్‌ను బుధవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఆవిష్కరించారు.

వినాయకుడి నుంచి సైబర్‌ భద్రత పాఠాలు :

‘వినాయకుడి నుంచి సైబర్‌ భద్రత పాఠాలు’ అనే సందేశంతో పోస్టర్‌ను రూపొందించారు. వినాయకుడి పెద్ద చెవులు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినాలని, చిన్న కళ్లు పరిసరాలను నిశితంగా గమనించాలని, పెద్ద తలతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించేలా అవగాహన కల్పించారు. అత్యాశ, భయం, తొందరపాటు వంటి భావోద్వేగాలను సైబర్‌ నేరగాళ్లు మోసాలకు ఉపయోగించుకుంటారని సీపీ పేర్కొన్నారు.

ఓటీపీ, పాస్‌వర్డ్‌ వివరాలు చెప్పొద్దు :

తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయడం, గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. బ్యాంక్ ఖాతా వివరాలు, కార్డు సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ, పిన్ వంటి గోప్యమైన వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని స్పష్టం చేశారు.

మోసపోతే వెంటనే 1930కు ఫోన్ :

ఆన్‌లైన్‌ ఉద్యోగాలు, పెట్టుబడులు, రుణాలు, బహుమతులు, లాటరీల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మి మోసపోవద్దని సీపీ సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకుండా, బలమైన పాస్‌వర్డ్‌లు, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ ఉపయోగించాలని తెలిపారు.

సైబర్‌ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి, www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మోసం జరిగిన వెంటనే స్పందిస్తే నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ వెంకటరమణ, సీఎసీ-2 ఏసీపీ జానీ నర్సింహులు, ఎస్‌ఐలు చరణ్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles