విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే దసరా మహోత్సవాలు-2026 షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ దసరా ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
ఈ ఉత్సవాలు అక్టోబర్ 11న శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకారంతో ఘనంగా ప్రారంభం కానున్నాయి. చివరి రోజున అనగా అక్టోబర్ 20న విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. పది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ప్రతిరోజూ అమ్మవారు వివిధ విశేష అలంకారాలలో భక్తులను అనుగ్రహించనున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


