కొండా సురేఖ మాస్టర్ ప్లాన్ అదేనా..? అందుకే మురళి మీసం మెలివేసాడా..? :
తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖను తొలగించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బర్తరఫ్ నిర్ణయంపై కొండా దంపతులు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సురేఖ తీవ్ర ఆరోపణలు చేయగా.. ఆమె భర్త కొండా మురళి తనదైన శైలిలో స్పందించారు.
మీడియా ముందు కొండా మురళి యాటిట్యూడ్ :
మంత్రి పదవి నుంచి సురేఖను తొలగించిన వార్తల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన కొండా మురళి మీడియా కెమెరాలకు చిరునవ్వుతో కనిపించారు. ఈ సందర్భంగా మీసం తిప్పుతూ ఆయన ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ తదుపరి రాజకీయ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని మురళి తెలిపారు. అయితే దీని పై రాజకీయ వర్గాలల్లో మాత్రం వేరే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొండా సురేఖా ఓ మాస్టర్ ప్లాన్ తో రాబోతుందని.. అది రేవంత్ రెడ్డిని చిక్కుల్లో పడేయబోతుందని..అప్పుడు మేం అంటే ఏంటో తెలుస్తుందని..సింబాలిక్ గా ఇలా మీసం మెలివేశాడు అంటున్నారు.
రేవంత్‌పై సురేఖ సంచలన ఆరోపణలు :
తనను మంత్రివర్గం నుంచి తొలగించడం వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి, బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఉన్నాయని సురేఖ ఆరోపించారు. తనను తొలగించకపోతే తాను పదవి నుంచి తప్పుకుంటానని రేవంత్‌రెడ్డి అధిష్ఠానాన్ని హెచ్చరించారని ఆమె పేర్కొన్నారు. అందుకే తనపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
‘నాపైనే ఎందుకు చర్యలు?’ :
తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే సీఎస్ ద్వారా గవర్నర్‌కు లేఖ పంపించారని సురేఖ మండిపడ్డారు. లెటర్‌హెడ్, సంతకం వంటి అంశాలు కూడా లేవని పేర్కొంటూ.. ఇతరులపై తీసుకోని చర్యలు తన విషయంలోనే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.
కుమార్తె వ్యాఖ్యలపై సురేఖ వివరణ :
తన కుమార్తె సుస్మిత పటేల్‌కు స్వతంత్ర వ్యక్తిత్వం ఉందని సురేఖ అన్నారు. ఆమె వ్యక్తిగత అభిప్రాయాలకు తాను ఎలా బాధ్యత వహిస్తానని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి తాను సమర్పించిన లేఖను త్వరలో మీడియా ముందుకు తీసుకొస్తానని వెల్లడించారు.


