వివిధ సోషల్ మీడియా వేదికల్లో తమ పేరుతో ప్రచారం అవుతున్న వార్తలు, పోస్టులపై కొండా సురేఖా స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో తమ పేరుతో వైరల్ అవుతున్న ఎలాంటి వార్తలు, పోస్టులతోనూ తమకు సంబంధం లేదని వెల్లడించారు. ప్రజలు, మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
అధికారిక ఖాతాల నుంచే సమాచారం :
తమకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే విషయంలో అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆయా ఖాతాల్లో వెల్లడించే సమాచారం మాత్రమే తమ అధికారిక అభిప్రాయాలు, ప్రకటనలుగా పరిగణించాలని పేర్కొన్నారు.
మీడియా, ప్రజలకు విజ్ఞప్తి :
తమ పేరును ఉపయోగించి సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టులు లేదా వార్తలు వచ్చినా వాటిని వెంటనే నమ్మవద్దని కోరారు. సమాచారం నిజమా..? కాదా..? అనే విషయాన్ని అధికారిక ఖాతాల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు. మీడియా మిత్రులు కూడా వార్తల ప్రచురణకు ముందు అధికారిక వేదికల్లోని సమాచారాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా మీడియా ప్రతినిధులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని వారు కోరారు.



