HomeWarangal Newsగద్దర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేకి ప్రజా సంఘాల వినతి

గద్దర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేకి ప్రజా సంఘాల వినతి

Published on

spot_img

ప్రజాయుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దరన్న విగ్రహ ఏర్పాటు కోసం హనుమకొండ జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి వివిధ ప్రజా సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, గద్దర్ విగ్రహ స్థాపన కోసం హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రాన్ని వెంటనే అధికారులకు ఫార్వర్డ్ చేసినందుకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో గద్దరన్న పాత్ర అత్యంత కీలకమైందని వారు కొనియాడారు. గద్దర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకుని, పీడిత ప్రజల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గద్దర్ విగ్రహ స్థాపన కమిటీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు, బీసీ జేఏసీ నాయకులు డాక్టర్ తిరునహరి శేషు, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, డీబీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుంచు రాజేందర్, గజాల గోవర్ధన్, గద్దర్ సాంబయ్య, పి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles