HomeWarangal Newsవరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రత్యేక హిమోఫిలియా వార్డును ఏర్పాటు చేయాలి: హిమోఫిలియా సొసైటీ విజ్ఞప్తి

వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రత్యేక హిమోఫిలియా వార్డును ఏర్పాటు చేయాలి: హిమోఫిలియా సొసైటీ విజ్ఞప్తి

Published on

spot_img

వరంగల్: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నూతన భవనంలో హిమోఫిలియా బాధితుల కోసం ప్రత్యేక వార్డుతో పాటు 24 గంటలూ అందుబాటులో ఉండేలా హిమోఫిలియా ట్రీట్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని హిమోఫిలియా సొసైటీ వరంగల్ చాప్టర్ ప్రభుత్వాన్ని కోరింది. నిరంతరం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అత్యవసర క్లాటింగ్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు హిమోఫిలియా సొసైటీ వరంగల్ చాప్టర్ కార్యదర్శి ఎన్. సుమన్ కుమార్, ఉపాధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ ఆదివారం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాటం రాంకుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎదుర్కొంటున్న వైద్య, ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఆయనకు వివరించారు.

రక్తస్రావ వ్యాధితో పేదలకు తీవ్ర ఆర్థిక భారం

హిమోఫిలియా అనేది పుట్టుకతో వచ్చే రక్తం గడ్డకట్టని వ్యాధి. చిన్న గాయం లేదా దెబ్బ తగిలినా రక్తస్రావం త్వరగా ఆగక కీళ్లు, కండరాలలో అంతర్గత రక్తస్రావం జరుగుతుందని, సరైన సమయానికి చికిత్స అందకపోతే అంగవైకల్యం లేదా ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని సొసైటీ ప్రతినిధులు వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫ్యాక్టర్ ఇంజెక్షన్లు చాలా ఖరీదైనవి కావడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తున్నాయని తెలిపారు.

ఐదు జిల్లాల రోగులకు ప్రధాన ఆధారం

ప్రస్తుతం వరంగల్‌తో పాటు చుట్టుపక్కల ఐదు జిల్లాల నుంచి సుమారు 150 మంది హిమోఫిలియా బాధితులు ఎంజీఎం హాస్పిటల్‌పైనే ఆధారపడి చికిత్స పొందుతున్నారని ప్రతినిధులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు నూతన సూపర్ స్పెషాలిటీ భవనంలో 24×7 వైద్య సేవలు, ప్రాణాధార ఇంజెక్షన్లు నిరంతరం లభించేలా ప్రత్యేకం సెంటర్ ఏర్పాటు చేయడం అత్యంత ఆవశ్యకమని సూచించారు.

స్పందించిన ఎంజీఎం సూపరింటెండెంట్

వినతిపత్రం స్వీకరించిన ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాటం రాంకుమార్ రెడ్డి దీనిపై సానుకూలంగా స్పందించారు. నూతన సూపర్ స్పెషాలిటీ భవనంలో ప్రత్యేక హిమోఫిలియా వార్డు, ట్రీట్మెంట్ సెంటర్ ఏర్పాటు అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles