HomeLatest Newsవాతావరణ మార్పులపై సరిహద్దులు దాటి పోరాడాలి: భూటాన్‌ సదస్సులో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

వాతావరణ మార్పులపై సరిహద్దులు దాటి పోరాడాలి: భూటాన్‌ సదస్సులో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

Published on

spot_img

థింపూ (భూటాన్): వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్న నేపథ్యంలో దక్షిణాసియా దేశాలు సరిహద్దులతో సంబంధం లేకుండా సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం ఒక్క దేశం బాధ్యత మాత్రమే కాదని, భవిష్యత్ తరాల కోసం ప్రాంతీయ సహకారంతో సమగ్ర పరిష్కారాలు సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

భూటాన్ రాజధాని థింపూలో ఆదివారం నిర్వహించిన ‘సౌత్ ఏషియా పార్లమెంటరీ డైలాగ్ ఆన్ ఎన్విరాన్‌మెంట్, క్లైమేట్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ సదస్సులో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొని ప్రసంగించారు. దక్షిణాసియా దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు, విధాన నిర్ణేతలు, నిపుణులు హాజరైన ఈ వేదికపై ఆమె పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధిపై కీలక విషయాలను లేవనెత్తారు.

ప్రకృతిని కాపాడుతూ సాగేదే నిజమైన అభివృద్ధి

అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి సాధించడమే నిజమైన సుస్థిర అభివృద్ధి అని ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధితో పాటు ప్రకృతి వనరులను కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, మనం నేడు తీసుకునే నిర్ణయాలే రేపటి తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని గుర్తుచేశారు. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, వరదలు, నీటి కొరత వంటి సమస్యలు ఇప్పటికే వ్యవసాయం, ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఉమ్మడి విధానాలు – సంయుక్త కార్యాచరణ

వాతావరణ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు పునరుత్పాదక ఇంధనం, నీటి సంరక్షణ, హరిత మౌలిక వసతులు, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ సూచించారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల నేరుగా ప్రభావితమవుతున్న రైతులు, మహిళలు, యువత, అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించాలన్నారు. హరిత అభివృద్ధి, స్వచ్ఛమైన ఇంధన రంగార్థంలో భారత్ సాధిస్తున్న అనుభవాలను ఇతర దక్షిణాసియా దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దక్షిణాసియా పార్లమెంటేరియన్లు తరచూ సమావేశమై ఉమ్మడి సమస్యలపై సంయుక్త కార్యాచరణ రూపొందించుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.