HomeEntertainmentఒక్కే ఒక్క వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసిన అమల!

ఒక్కే ఒక్క వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసిన అమల!

Published on

spot_img

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమల అక్కినేని (Amala akkineni) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సామాజిక కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువగా ఉంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తెల్లటి చేనేత చీరలో ఎంతో హుందాగా, ప్రశాంతంగా కనిపించిన అమల లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

తెల్లటి దుస్తులంటే అమలకు ఇష్టం :

తెలుపు రంగు దుస్తులు తనకు ఎంతో ఇష్టమని అమల గతంలో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తెల్లటి దుస్తులు చూడగానే తన మూడ్ మారిపోతుందని ఆమె చెప్పుకొచ్చారు. భారతీయ మహిళల వార్డ్‌రోబ్‌లో ఖాదీ, కేరళ కాటన్, బెంగాల్ కాటన్, కోటా వంటి హ్యాండ్‌లూమ్ చీరలకు ప్రత్యేక స్థానం ఉంటుందని అమల అభిప్రాయపడ్డారు.

ప్రతి చీర వెనుక ఓ జ్ఞాపకం :

తన వద్ద ఉన్న చీరల్లో చాలా వరకు తనకు ఇష్టమైన వ్యక్తులు బహుమతిగా ఇచ్చినవేనని అమల తెలిపారు. మరికొన్ని చీరలను తాను ఎంతో ఇష్టంతో ఏళ్లుగా సేకరించినట్లు చెప్పారు. అందుకే తన దగ్గర ఉన్న ప్రతి చీర కేవలం వస్త్రం మాత్రమే కాదని, దాని వెనుక ఓ మధురమైన జ్ఞాపకం ఉంటుందని వివరించారు.

కేరళ-కాంచీపురం కలనేత ప్రత్యేకత :

తాజా వీడియో కోసం అమల ‘పిచకమ్ వీవ్స్’ బ్రాండ్‌కు చెందిన ప్రత్యేకమైన హ్యాండ్‌లూమ్ చీరను ధరించారు. కేరళ సంప్రదాయ నేతకు కాంచీపురం డిజైన్లను జోడించి ఈ చీరను రూపొందించారు. గోల్డెన్ బోర్డర్, అందమైన పూల డిజైన్లు చీరకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.

చేనేతకు అమల మద్దతు :

చేనేత కార్మికుల ప్రతిభను ప్రశంసిస్తూ అమల చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. తెల్లటి చీరలో రాయల్ లుక్‌లో మెరిసిన ఆమె ఫొటోలు, వీడియో ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Clik Here For Video: https://www.instagram.com/akkineniamala/reel/Dc7keRroDVg/

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.