HomeWarangal Newsఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్–2026కు నామినేషన్ల ఆహ్వానం!

ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్–2026కు నామినేషన్ల ఆహ్వానం!

Published on

spot_img

వరంగల్: ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా), వరంగల్ లోకల్ సెంటర్ ఆధ్వర్యంలో అందజేయనున్న “ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్–2026” కోసం అర్హులైన ఇంజనీర్ల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

వరంగల్, హనుమకొండ, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ఇంజనీర్లు ఈ అవార్డులకు నామినేషన్లు సమర్పించవచ్చని పేర్కొన్నారు. అవార్డులను రెండు విభాగాల్లో అందజేయనున్నారు.

ఏ విభాగం: ప్రభుత్వ / ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు

బి విభాగం: స్వయం ఉపాధి, కన్సల్టెంట్ ఇంజనీర్లు

ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ అవార్డులను అందజేస్తారు. ప్రథమ అవార్డు గ్రహీతకు రూ.5,000, ద్వితీయ అవార్డు గ్రహీతకు రూ.3,000 నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేయనున్నారు.

సెప్టెంబర్ 15, 2026న ఇంజనీర్స్ డే సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. నామినేషన్లు సమర్పించేందుకు సెప్టెంబర్ 10, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.

మరిన్ని వివరాలకు 0870-2434422 నంబర్‌ను సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య సంప్రదించాలని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) వరంగల్ లోకల్ సెంటర్ గౌరవ కార్యదర్శి డా. పి. మురళీధర్, చైర్మన్ డా. ఎల్. ఆంజనేయులు తెలిపారు.

Interested candidates can also download the guidelines and nominations forms by clicking on the following link : https://drive.google.com/drive/folders/1hsXSpwdiYU9SCysDMVJi67AZnWjYj77e?usp=sharing

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles